8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వృషకర్మ నుంచి ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌’ పాట విడుదల

Writer: Chandrika 11:55 PM, 7 నవంబర్, 2026
వృషకర్మ నుంచి ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌’ పాట విడుదల

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా దర్శకుడు కార్తీక్‌ దండు తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వృషకర్మ’. మైథలాజికల్‌ థ్రిల్లర్‌, అడ్వెంచర్‌ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. దీపావళి కానుకగా చిత్రబృందం తొలి లిరికల్‌ సాంగ్‌ ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌’ను విడుదల చేసింది. నవంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాటలో నాగచైతన్య సరికొత్త స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు.

ఈ సినిమాలో అర్జున్‌ పాత్రలో కనిపించనున్న చైతన్య.. పాటలో తన యాటిట్యూడ్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిత్రానికి అజనీష్‌ బి.లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. ‘కాంతార’, ‘విరూపాక్ష’ చిత్రాలతో తనదైన సంగీతంతో ఆకట్టుకున్న ఆయన ఈ సినిమాకూ స్వరాలు సమకూరుస్తున్నారు. పాటకు అభినవకవి సాహిత్యం అందించారు.

నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. ‘లాపతా లేడీస్‌’ ఫేమ్‌ స్పర్శ్‌ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రగుల్‌ డి.హెరియన్‌ సినిమాటోగ్రఫీ, నవీన్‌ నూలి ఎడిటింగ్‌, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్‌ డిజైన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారీ సెట్లు, గుహల నేపథ్యంలో సాగే విజువల్‌ ఎపిసోడ్స్‌ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లో భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా రూపొందుతున్న ‘వృషకర్మ’ డిసెంబర్‌ 4న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కీరవాణి ఇంట శుభకార్యం

కీరవాణి ఇంట శుభకార్యం

‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్‌లో విజేతలు లేరు..

‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్‌లో విజేతలు లేరు..

తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!

తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..

జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాపై ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాపై ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

విడుదలకు ముందే వివాదంలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’..

విడుదలకు ముందే వివాదంలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’..

ట్యాగ్లు
అక్కినేని నాగచైతన్యవృషకర్మతెలుగు సినిమాస్వాగ్ ఆఫ్ అర్జున
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీపై సోనియా  గాంధీ విమర్శలు
రాజకీయాలు

బీజేపీపై సోనియా గాంధీ విమర్శలు

అమెరికా పర్యటనకు రాహుల్‌
జనరల్

అమెరికా పర్యటనకు రాహుల్‌

పోలండ్‌లో కాల్పుల కలకలం..
జనరల్

పోలండ్‌లో కాల్పుల కలకలం..

కీరవాణి ఇంట శుభకార్యం
సినిమాలు

కీరవాణి ఇంట శుభకార్యం

బిగ్‌బాస్ 10: వర్షిణి, దేబ్జానీకి నాగార్జున క్లాస్.. నరేష్‌కు శిక్ష!
షోస్

బిగ్‌బాస్ 10: వర్షిణి, దేబ్జానీకి నాగార్జున క్లాస్.. నరేష్‌కు శిక్ష!

వృషకర్మ నుంచి ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌’ పాట విడుదల
సినిమాలు

వృషకర్మ నుంచి ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌’ పాట విడుదల

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం
రాజకీయాలు

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్
రాజకీయాలు

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్
రాజకీయాలు

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ
రాజకీయాలు

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ
రాజకీయాలు

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌
జనరల్

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!