

టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీని నిజంగా ఫైర్ బ్రాండ్‌గా చెప్పొచ్చు. సినిమా వేడుకలైనా, ఇంటర్వ్యూల్లో అయినా — ఆయన చాలా అగ్రెసివ్‌గా, నేరుగా మాట్లాడే వ్యక్తి. ఈ స్వభావం వల్ల కొన్ని సందర్భాల్లో నాగవంశీ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. అయినా తన శైలి మార్చుకోకుండా అలాగే కొనసాగుతున్నాడు. తన బ్యానర్ నుంచి రాబోతున్న ఎపిక్ సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ లాంచ్ సందర్భంగా కూడా నాగవంశీ తనదైన శైలిలో పంచ్‌లు వదిలాడు.
ఇటీవల అరెస్ట్ అయిన పైరసీ సైట్ iBomma నిర్వాహకుడు రవి గురించి సోషల్ మీడియాలో ప్రజలు చూపుతున్న స్పందనపై కూడా నాగవంశీ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. 90 వ దశక నేపథ్యంతో ఎపిక్ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో, అప్పటి కాలంతో ఇప్పుడు ఏమి మారింది? ఏమి మిస్ అవుతున్నాం? అని ఆయనను ఒక ప్రశ్న అడిగారు. దానికి నాగవంశీ బదులిస్తూ — “మారింది అంతా సోషల్ మీడియానే” అని కామెంట్ చేశాడు. iBomma రవిని ప్రజలు రాబిన్ హుడ్‌గా కీర్తిస్తున్నారని, అంతకంటే పెద్ద అన్యాయం ఏముంటుందో అంటూ ప్రశ్నించాడు.
“రవిని రాబిన్ హుడ్ అంటున్నారు… కానీ డబ్బులు పెట్టి, కష్టపడి సినిమాలు తీసే మమ్మల్ని మాత్రం దొంగల్లా చూస్తున్నారు. 50 రూపాయలు టికెట్ రేటు పెంచితే అది పెద్ద నేరంలా మాట్లాడుతున్నారు. ఇదంతా సోషల్ మీడియా తెచ్చిన మార్పు” అంటూ నాగవంశీ అసహనం వ్యక్తం చేశాడు.
అలాగే — “విజయ్ దేవరకొండతో కింగ్డమ్ తీశారు, ఇప్పుడు ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ఎపిక్ తీస్తున్నారు. ఈ అనుభవం ఎలా ఉంది?” అని అడిగినప్పుడు, “ఈ రెండు సినిమాలకు పోలిక పెట్టొద్దు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు” అని స్పష్టంగా చెప్పాడు నాగవంశీ.













.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!