

యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త హారర్ థ్రిల్లర్ చిత్రానికి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ నటుడు ఈశ్వర్ రాచిరాజు ఈ చిత్రంతో సోలో హీరోగా పరిచయం కానున్నారు. నందు లిఖిత మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్ గాదె ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై వెంకట్ తలారి ప్రొడక్షన్ నంబర్ 3గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
పూజిత పొన్నాడ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాలోని ఆమె పాత్రను పరిచయం చేసే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో పూజిత ‘నర్తకి’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ హారర్ థ్రిల్లర్‌లో సింధు కాసారం, సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దికొండ, సునీత మనోహర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామీణ నేటివిటీకి హారర్ అంశాలను జోడించి రూపొందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!