

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుత స్పందనతో ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పుడు ‘పెద్ది రీలోడెడ్’ వెర్షన్‌గా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. కథను మరింత బలంగా చూపించేలా కొన్ని కొత్త సన్నివేశాలను జోడిస్తూ చిత్రబృందం ఈ ప్రత్యేక వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ఈ రీలోడెడ్ వెర్షన్‌లో దాదాపు 5 నిమిషాల 56 సెకన్ల అదనపు ఫుటేజ్‌ను చేర్చారు. జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కీలక ఘట్టాలతో పాటు జగపతి బాబు పాత్రను మరింత ప్రభావవంతంగా చూపించే సన్నివేశాలు ఇందులో ఉండనున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. కొత్త సన్నివేశాలతో ‘పెద్ది’ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!