

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా టాలీవుడ్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాను విడుదలకు ముందే తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు అనుమతి కోరినట్లు సమాచారం.
జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే ఈ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. అనుమతి లభిస్తే విడుదలకు ముందే సినిమాకు భారీ హైప్ ఏర్పడే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!