
జనరల్

కన్నడ నటి పాయల్ రాధాకృష్ణ టాలీవుడ్లో ప్రసన్న వదనం సినిమాతో అడుగుపెట్టింది. ఆ తర్వాత చౌర్యపాఠం, పాపం ప్రతాప్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా ఈ నెల 15న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజాగా సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న పాయల్ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు తెలుగువాడినే పెళ్లి చేసుకోవాలని ఉందని బోల్డ్‌గా తెలిపింది. తెలుగు సినీ పరిశ్రమ తనకు గుర్తింపు, గౌరవం, ఆర్థిక స్థిరత్వం ఇచ్చిందని ఆమె చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!