

సామాజిక మాధ్యమాల్లో ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ అసభ్యకర కంటెంట్‌ను రూపొందించడంపై అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన వీడియోను ఏఐతో మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా రూపొందించడంపై ఆయన స్పందించారు. మహిళలను గౌరవించే సంస్కృతి ఉన్న దేశంలో ఇలాంటి చర్యలు సిగ్గుచేటని పేర్కొన్న ఎన్టీఆర్.. ఈ వీడియో వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోనని, బాధ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
ఇలాంటి అసభ్యకర కంటెంట్‌ను ఎవరూ చూడటం, షేర్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం వంటివి చేయొద్దని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు తీసుకురావాలని కోరారు. ఇటీవల నటి శాలిని పాండే కూడా తనను పోలిన అసభ్యకర వీడియోలు వైరల్ కావడంపై స్పందించారు. గతంలో రష్మిక మందన్న, కత్రినా కైఫ్, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేశ్ తదితరుల పేర్లతోనూ డీప్‌ఫేక్ కంటెంట్ వైరల్ అయింది. ఈ ఘటనలు ఏఐ సాంకేతికత దుర్వినియోగంపై మరోసారి ఆందోళనలను పెంచుతున్నాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!