
న్యూస్

‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో స్టేజ్‌పై నవదీప్ కూడా ఉండటంతో, ఆయన ఎందుకు జోక్యం చేసుకోలేదన్న ప్రశ్నలు వినిపించాయి.
ఇటీవల ‘దండోరా’ సినిమా ప్రచారంలో భాగంగా చిత్రబృందం విద్యార్థులతో చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక విద్యార్థి “శివాజీ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు?” అని ప్రశ్నించగా, నవదీప్ స్పష్టంగా సమాధానం ఇచ్చారు.
వేదికపై ఎవరు మాట్లాడుతున్నా మధ్యలో ఆపడం సరికాదని ఆయన అన్నారు. ముఖ్యంగా శివాజీ చాలా సీనియర్ నటుడని, ఆయన అనుభవాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాంటి సందర్భాల్లో జోక్యం చేసుకోవడం సరైన పద్ధతి కాదని నవదీప్ అభిప్రాయపడ్డారు.
నవదీప్ వ్యాఖ్యలతో ఈ అంశంపై చర్చకు కొంత స్పష్టత వచ్చినట్టుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!