
జనరల్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది పారడైజ్’ సినిమా నుంచి విడుదలైన ‘ఏషనాగుల’ పాటకు భారీ స్పందన లభిస్తోంది. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఈ మాస్ సాంగ్ యూట్యూబ్‌తో పాటు రీల్స్, షార్ట్స్, మీమ్స్‌లోనూ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పాటలోని ఎనర్జిటిక్ బీట్, మాస్ రిథమ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సాంగ్ వేగంగా వైరల్‌గా మారింది.
తాజాగా ‘ఏషనాగుల’ పాట యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ మార్క్‌ను దాటింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ మైలురాయిని అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం, తెలంగాణ జానపద బాణీ ఆధారంగా రూపొందిన పాటకు వస్తున్న స్పందన ‘ది పారడైజ్’పై అంచనాలను మరింత పెంచుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!