

2019లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వైమానిక దళ మాజీ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ తాజాగా కమర్షియల్ పైలట్‌గా మారారు. వైమానిక దళం నుంచి ముందస్తు పదవీ విరమణ పొందిన ఆయన.. ఈ ఏడాది ఆగస్టులో గోవాకు చెందిన ప్రైవేట్ విమానయాన సంస్థ ఫ్లై 91లో కమర్షియల్ పైలట్‌గా చేరినట్లు పీటీఐ కథనం వెల్లడించింది.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరిలో భారత్ బాలాకోట్‌లో వైమానిక దాడులు నిర్వహించిన అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆ సమయంలో జరిగిన వైమానిక పోరులో అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ ఎఫ్-16ను కూల్చినట్లు భారత్ పేర్కొంది. అనంతరం ఆయన పాక్‌లో పట్టుబడి, అంతర్జాతీయ ఒత్తిడి నేపథ్యంలో విడుదలయ్యారు. ఇప్పుడు సైనిక విమానయాన అనుభవాన్ని కమర్షియల్ ఏవియేషన్‌లో కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!