

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు, రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలిస్తారు. అనంతరం 3.20 గంటలకు దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్‌లో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను తనిఖీ చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు దౌల్తాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను, 4.30 గంటలకు హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలిస్తారు.
హకీంపేటలోనే కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం రోడ్డు మార్గంలో కొడంగల్‌లోని తన నివాసానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. రెండు రోజుల పర్యటనలో విద్యా సంస్థల నిర్మాణ పనులతో పాటు నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!