

తమిళనాడులో కొత్త శాసనసభ, సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,200 కోట్లను కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త భవనాలను కనీసం వందేళ్లపాటు ఉపయోగపడేలా ఆధునిక ప్రమాణాలతో నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సముదాయాన్ని రూపొందించనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం ఉన్న సెయింట్ జార్జ్ కోట భవనాలను భవిష్యత్ తరాల కోసం చారిత్రక వారసత్వ కట్టడాలుగా పరిరక్షిస్తామని విజయ్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేసే దిశగా ఒలింపిక్ సిటీ, మోటార్ స్పోర్ట్స్ సిటీల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొత్త శాసనసభ, సచివాలయ సముదాయం రాష్ట్ర పరిపాలనా అవసరాలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!