

దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కిన ‘ఐ యామ్ గేమ్’ భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ ‘డాన్ జాన్’ అనే లక్కీ గ్యాంబ్లర్ పాత్రలో కనిపించారు. ఫాంటసీ అంశాలు, వేగవంతమైన యాక్షన్ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగిందని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా బార్ ఫైట్, ఇంటర్వెల్ యాక్షన్‌లో దుల్కర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

అయితే సెకండాఫ్ విషయంలో మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కథనం నెమ్మదించడం, బలహీనమైన సంభాషణలు, ఎడిటింగ్ లోపాలు సినిమా వేగాన్ని ప్రభావితం చేశాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దుల్కర్ మేనరిజమ్స్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను మెప్పించినప్పటికీ, సాధారణ ప్రేక్షకులను సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే టాక్ ఉంది. మిస్కిన్, ఆంటోనీ వర్గీస్, కాయదు లోహర్ కీలక పాత్రల్లో నటించగా, జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు బలంగా నిలిచింది. మరోవైపు తెలుగు వెర్షన్‌కు తొలిరోజే సాంకేతిక సమస్యలు ఎదురవడంతో మార్నింగ్, మ్యాట్నీ షోలు రద్దయ్యాయి. సమస్యను పరిష్కరించి నైట్ షోల నుంచి తెలుగు ప్రదర్శనలు కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!