

కింగ్ నాగార్జున సమర్పణలో వచ్చిన లేటెస్ట్ హార్ట్బస్టర్ ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడు వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం థాంక్ యూ మీట్ నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. “మీ హుషారు, ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి ఇప్పటికే పలుమార్లు మాట్లాడాను. ఈ సినిమాను నేను ప్రజెంట్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. అనీష్ విషయంలో చాలా గర్వంగా ఉంది. అలాగే అనస్వర, మహేష్‌తో పాటు ప్రతి ఒక్కరికీ కంగ్రాట్యులేషన్స్. ఈ వేడుకలో అనీష్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ పిలిచి థాంక్స్ చెప్పడం నాకు చాలా నచ్చింది. తెలుగు సినిమా ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కొత్త టాలెంట్‌ను, కొత్తదనాన్ని వాళ్లు ఎంతో ఎంకరేజ్ చేస్తారు. చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ నన్ను అన్నా అని పిలుస్తాడు. మా అబ్బాయి అఖిల్ ఏమో చిరంజీవి గారిని పెదనాన్న అంటాడు. మరి ఆయన్ని నేను ఏమని పిలవాలో అర్థం కావడం లేదు (నవ్వుతూ). సో.. ఈరోజు బాస్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. రామ్ చరణ్ నన్ను అన్నా అంటాడు కాబట్టి, నేను కూడా చిరంజీవి గారిని అన్నా అని పిలుస్తాను. చిరంజీవి గారు ఈ వేడుకకు వచ్చి టీంను బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
హీరో అనీష్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. చిరంజీవి గారి అభిమానులకు, అక్కినేని నాగార్జున గారి అభిమానులకు థాంక్యూ సో మచ్. నాగార్జున గారిది చాలా పెద్ద మనసు. ఆయనను కలిసినప్పటి నుంచి నాకు అందించిన సపోర్ట్, ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే మెమరీ. ప్రతి ఇంట్లో చిరంజీవి గారి పేరు వినిపిస్తుంది. ఎవరైనా సినిమాల్లోకి వెళ్లాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా ‘నువ్వు ఏమైనా చిరంజీవి అన్నా?’ అని అంటుంటారు. ఆయన ఎంతోమందికి ఇన్స్పిరేషన్. అలాంటి వారిలో నేను కూడా ఒకడిని. ఆయన సమక్షంలో ఈ వేదికపై నిలబడి మాట్లాడటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. చిరంజీవి గారికి, నాగార్జున గారికి ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో యూనానిమస్‌గా ఇంత మంచి రివ్యూ రావడం ‘ఇట్లు అర్జున’కు దక్కింది. అనీష్ ఈ సినిమాతో చాలా మంచి ఆరంభం చేశాడు. తనకు యూనివర్స్ మొత్తం సపోర్ట్ చేసినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ‘ఇట్లు అర్జున’ నా మనసుకు చాలా దగ్గరైన సినిమాల్లో ఒకటి. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. అనస్వర రాజన్ అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఆడియో ఆల్బమ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది.
హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ.. “ఇది చాలా బ్యూటిఫుల్ జర్నీ. గత కొన్ని రోజులుగా మేము థియేటర్లను విజిట్ చేస్తున్నాం. అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌కు, ప్రొడ్యూసర్‌కు థాంక్యూ. మేము థియేటర్ విజిట్స్‌కు వెళ్లినప్పుడు అనీష్ పర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తను మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. చిరంజీవి గారు మనందరికీ ఇన్స్పిరేషన్. ఆయన ఈ వేడుకకు వచ్చి బ్లెస్ చేయడం మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. నాగార్జున గారు మా సినిమాను ప్రజెంట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.
డైరెక్టర్ మహేష్ ఉప్పల మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నాగార్జున గారికి, చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నన్ను ఇంతగా నమ్మిన మా నిర్మాత వెంకీ గారికి ధన్యవాదాలు. నా మొదటి సినిమాను నాగార్జున గారు ప్రజెంట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన చిరంజీవి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చిరంజీవి గారు, నాగార్జున గారి లాంటి ఇద్దరు గొప్ప వ్యక్తులు నా సినిమా చూడటం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. నాపై ఎంతో నమ్మకం పెట్టుకుని నన్ను ప్రోత్సహించారు. ఆయన నమ్మకమే అందరినీ సర్ప్రైజ్ అయ్యేలా చేసింది. అనీష్ థియేటర్లలో అందరినీ సర్ప్రైజ్ చేశాడు. తను భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన సినిమాలు చేస్తాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!