

స్టార్ హీరో ధనుష్ కోలీవుడ్లో హీరోగా, దర్శకుడిగా వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో దూసుకుపోతున్నారు. యాక్షన్, ఎమోషన్ పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయనపై దర్శకుడు మిస్కిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘హబిబి’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
ఈ సందర్భంగా మిస్కిన్ మాట్లాడుతూ, ధనుష్ కంటే ఆయన తండ్రి కస్తూరి రాజా నటనలో వంద రెట్లు మెరుగ్గా ఉంటారని అన్నారు. కస్తూరి రాజా సహజ నటన తనను ఎంతో ఆకట్టుకుందని గుర్తుచేశారు. అయితే, ధనుష్ నటనను తాను తక్కువగా చూడడం లేదని, ఆయన కూడా మంచి నటుడేనని స్పష్టం చేశారు. సినిమా రంగంలో కొన్నిసార్లు ఆత్మసంతృప్తి కోసం సినిమాలు చేస్తామని, అలాంటి సందర్భాల్లో నష్టాలు రావడం సహజమని, ఆ నష్టాలను భర్తీ చేసేందుకు కమర్షియల్ సినిమాలు చేయడం సాధారణమని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!