

ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని జిల్లాలకు పసుపు హెచ్చరిక, మరికొన్ని ప్రాంతాలకు నారింజ హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు.
ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అత్యవసర పరిస్థితులు లేకపోతే ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. తగినంత నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నైరుతీ రుతుపవనాలు ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!