

ప్రపంచ ప్రముఖ టెక్ సంస్థ మెటా ఇప్పటికే తన వర్క్‌ఫోర్స్‌లో సుమారు 10 శాతం ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో మరిన్ని లేఆఫ్స్ ఉండొచ్చనే వార్తలు వెలువడుతున్న సమయంలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఉద్యోగులకు కీలక మెయిల్ పంపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఏడాది మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండకపోవచ్చని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తును మార్చే సాంకేతికత అని, దాన్ని వేగంగా అందిపుచ్చుకునే సంస్థలే రాబోయే తరానికి మార్గం చూపిస్తాయని జుకర్బర్గ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఉద్యోగులను తొలగించడం తనకు కూడా బాధ కలిగించే విషయమేనని తెలిపారు. మరోవైపు అమెరికా, ఐరోపా, సింగపూర్‌లలో కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇచ్చిన కొద్ది రోజులకే లేఆఫ్ మెయిల్స్ పంపినట్లు సమాచారం. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారికి 16 వారాల బేస్ పే, ప్రతి ఏడాది సేవకు అదనంగా రెండు వారాల జీతం, అలాగే 18 నెలల హెల్త్‌కేర్ కవరేజ్ అందించనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!