

ప్రముఖ గాయని జాస్మిన్ సాండ్లాస్ ఇటీవల దెహ్రాడూన్‌లోని ఓ యూనివర్సిటీ కాన్సర్ట్ సందర్భంగా అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్టేజ్ సమీపంలో అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తోపులాట చోటుచేసుకుని కొందరు కిందపడిపోయినట్లు సమాచారం. పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు గుర్తించిన జాస్మిన్ వెంటనే తన ప్రదర్శనను మధ్యలోనే ఆపేసి అభిమానుల భద్రతపై దృష్టి పెట్టారు.
భద్రతా సిబ్బంది బ్యారికేడ్ల వద్ద అభిమానులను నియంత్రించే ప్రయత్నంలో గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో జాస్మిన్ తన టీమ్‌ను పరిస్థితిని కంట్రోల్ చేయాలని సూచిస్తూ, అభిమానులను ప్రశాంతంగా ఉండాలని కోరినట్లు కనిపించింది. అనంతరం పరిస్థితి సర్దుకున్న తర్వాత ఆమె మళ్లీ స్టేజ్‌పైకి వచ్చి ప్రదర్శన కొనసాగించారు. భవిష్యత్తులో దెహ్రాడూన్‌లో మరింత బలమైన బ్యారికేడ్లు అవసరమని సరదాగా వ్యాఖ్యానించగా, అభిమానులు ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌ను ఆస్వాదించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!