

సినిమా విడుదలై రెండు దశాబ్దాలు గడిచినా ‘మురారి’ పై ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల రీ రిలీజ్ అయిన చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో, ఇప్పుడు ‘మురారి’ సినిమాను కూడా 4K ఫార్మాట్లో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. నూతన సంవత్సర కానుకగా ఈ నెల 31 న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.
నైజాం ఏరియాలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రీ రిలీజ్ బాధ్యతలు చేపట్టగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమై అంచనాలను మించి స్పందన వస్తోంది. రాజమండ్రి వంటి ప్రాంతాల్లో ముందస్తు బుకింగ్స్ పూర్తిగా హౌస్‌ఫుల్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.99, మల్టిప్లెక్స్‌లలో రూ.105 గా టికెట్ ధరలు నిర్ణయించడంతో ప్రేక్షకులు భారీగా బుకింగ్స్ చేస్తున్నారు. అంతేకాదు, సినిమాకు ముందు వారణాసి గ్లింప్స్‌ను ప్రదర్శించాలన్న యోచనతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!