

‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మృణాళిని రవి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు మహావిష్ణుతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ నెల 15న మలేసియాకు సమీపంలోని ఓ ద్వీపంలో ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగినట్లు సమాచారం. ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను మృణాళిని తాజాగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. మృణాళిని భర్త మహావిష్ణు మలేసియాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వక్త అని సమాచారం. ఇక మృణాళిని రవి తెలుగులో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చీంద్ర’ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!