
రాజకీయాలు

కన్నడ రాకింగ్ స్టార్ యష్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ ప్రకటన వచ్చినప్పటి నుంచి పలు వివాదాలను ఎదుర్కొంటోంది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ‘తబాహి’ పాటలోని రొమాంటిక్ సన్నివేశాలు, కియారా గ్లామర్ లుక్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటి హుమా ఖురేషి ట్రోలింగ్‌పై స్పందించారు. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్ చాలా వికృతమైన విషయమని పేర్కొంటూ, చిత్రంలో పనిచేసిన మహిళలు, ముఖ్యంగా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తప్పకుండా తమ ప్రతిభను నిరూపించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులే దాని గురించి మాట్లాడతారని, ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!