

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. తండ్రి-కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. పాజిటివ్ మౌత్ టాక్‌తో వసూళ్లలో దూసుకెళ్తున్న ఈ మూవీ ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. ప్రస్తుతం కూడా ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఇదిలా ఉంటే.. ‘ఇరుముడి’ నుంచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘మల్లెపూల పల్లకి.. మందార పల్లకి’ పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. థియేటర్లలో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ పాట ఇప్పుడు అధికారికంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సాంగ్‌కు చౌడమ్ శ్రీనివాసరావు సాహిత్యం అందించగా.. డప్పు శ్రీను ఆలపించారు. జీ.వీ. ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చారు. థియేటర్లలో సందడి చేసిన ఈ పాట ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ ఆకట్టుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!