

యువ హీరో సంగీత్ శోభన్, మాలీవుడ్ నటి అనస్వర రాజన్ జంటగా గోదావరి ప్రాంతం నేపథ్యంలో ఓ కొత్త రొమాంటిక్ డ్రామా తెరకెక్కుతోంది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంగీత్ శోభన్ మారుతిగా, అనస్వర రాజన్ శిరీషగా కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘అంతా రాములూరు చూసుకుంటారు’ అనే టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ఇది ప్రేమకథ కాదు’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన టైటిల్ గ్లింప్స్‌లో హీరో, హీరోయిన్ మధ్య అందమైన సంభాషణను మిక్కీ జే మేయర్ మధురమైన సంగీతంతో చూపించారు.
ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, వీజీబీ ఫిల్మ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ కథ అందించారు. రావు రమేశ్, రోహిణి, రఘుబాబు, అలీ, ఝాన్సీ, వినోద్ కుమార్, శివనారాయణ, శ్రీలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీతో పాటు ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.













కామెంట్స్ (1)
Waiting