
షోస్

తెలుగు సినీ నిర్మాతల మండలి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా, సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు మద్దతు ఇస్తుండగా, మన ప్యానెల్‌కు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మద్దతుగా నిలిచారు.
నిర్మాతల మండలిలో మొత్తం 1,245 మంది సభ్యులు ఉండగా, సుమారు 700 మంది వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రెండు వైస్ ప్రెసిడెంట్, రెండు సెక్రటరీ, రెండు జాయింట్ సెక్రటరీ, ఒక ట్రెజరర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి. కళ్యాణ్ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!