
జనరల్

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో సంయుక్త సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన సమాచారం పంపారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!