

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘ధర్మన్’ రెండో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హై-ఇంటెన్సిటీ గన్-ఫూ యాక్షన్ ఎలిమెంట్స్‌తో స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ అందించనున్న పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత హైప్ తీసుకురానుంది. ‘స్వాగ్ మోడ్ ఆన్’ అంటూ మేకర్స్ విడుదల చేసిన తాజా అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
శత్రువుల సామ్రాజ్యాన్ని ఒంటరిగా ఎదుర్కొంటూ ఓ పాతతరం మొనగాడు సాగించే ప్రతీకార ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రజినీకాంత్ పవర్‌ఫుల్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సిమ్రాన్, రాశీ ఖన్నా, యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై తాజా అప్‌డేట్‌తో అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!