

గ్లామరస్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం కార్తి హీరోగా నటిస్తున్న సర్దార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో ఎస్.జె. సూర్య, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మాళవిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా తమిళ సినిమాల్లో తనకు నచ్చిన హీరోయిన్ల గురించి మాట్లాడిన మాళవిక.. సాయి పల్లవి, త్రిష, నిత్యా మీనన్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమరన్ చిత్రంలో సాయి పల్లవి నటనకు ఫిదా అయినట్లు చెబుతూ, ఆమె ఆ సినిమాకు ఆత్మలా నిలిచారని ప్రశంసించారు. పొన్నియిన్ సెల్వన్‌లో త్రిష రాజసంగా, ఎంతో ఎలిగెంట్‌గా నటించారని కొనియాడారు. నిత్యా మీనన్ ఎంతో ప్రతిభావంతురాలని, పలు భాషల్లో సులువుగా నటిస్తూ విభిన్న పాత్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా తిరుచిత్రంబలం సినిమాలో నిత్యా నటన తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. మరోవైపు విజయ్ సేతుపతి, రాజ్ బి. శెట్టితో కలిసి మాళవిక పాకెట్ నావెల్ చిత్రంలోనూ నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!