

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కొత్త కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో ఉన్నప్పుడు లేదా యూనిఫాంలో రీల్స్ చేయడం, అధికారిక హోదాను ఉపయోగించి సోషల్ మీడియా ఫాలోవర్లను పెంచుకోవడం, తద్వారా ఆదాయం పొందడంపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలాగే వివాదాస్పద రాజకీయ పోస్టులు చేయడం, ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించడంపైనా పరిమితులు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇంక్రిమెంట్ల కోత, సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేయకుండా, సోషల్ మీడియాలో వృత్తిపరమైన ప్రవర్తనను పాటించేలా ఈ నిబంధనలు తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. కొత్త కోడ్ ఆఫ్ కండక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!