

తమిళనాడులో క్రీడా మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అగ్రకథానాయకుడు, మోటార్ స్పోర్ట్స్ అభిమాని అజిత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. చెన్నైలో అధునాతన ఒలింపిక్ సిటీతో పాటు ప్రత్యేక మోటార్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించడంపై ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టులు యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అజిత్ పేర్కొన్నారు.
మోటార్ స్పోర్ట్స్‌లో తనకున్న ఆసక్తిని ప్రస్తావించిన అజిత్.. తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య భారత మోటార్‌స్పోర్ట్స్ రంగానికి పెద్ద ముందడుగుగా నిలుస్తుందని అన్నారు. క్రీడా రంగంలో సీఎం విజయ్ చేపట్టే అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఒలింపిక్ సిటీలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలు, ఆధునిక శిక్షణ పరికరాలు, హై-పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్లు, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రేసింగ్‌పై ప్రత్యేక ఆసక్తి ఉన్న అజిత్ ఇప్పటికే ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో తన టీమ్‌ను ప్రకటించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!