

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్‌కు చేరుకున్న ఆయన, వివిధ విద్యా సంస్థల భవన సముదాయాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య, వెటర్నరీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు 400 పడకల ఆసుపత్రి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ భవనాలను పరిశీలించారు.
ఎడ్యుకేషన్ హబ్‌లోని అన్ని నిర్మాణ పనుల్లో సమన్వయంతో పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్మాణాల నాణ్యత, సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వర్షాల సమయంలో నీరు నిలవకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి, వర్షపు నీటిని ఒడిసిపట్టి ల్యాండ్‌స్కేపింగ్ పనులకు వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!