
జనరల్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ల మధ్య వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత, రఘు మాస్టర్ ప్యానెల్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించారంటూ ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలపై రఘు మాస్టర్ కౌంటర్ ఫిర్యాదు చేశారు. సుమలత పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తమ కార్యవర్గాన్ని ఫెడరేషన్ గుర్తించిందని రఘు మాస్టర్ తెలిపారు. ఫెడరేషన్ ఇచ్చిన గుర్తింపు లేఖతోనే బ్యాంకును సంప్రదించామని, ఆ లేఖ ఆధారంగానే బ్యాంకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. సుమలత ప్యానెల్‌ను ఫెడరేషన్ గుర్తించలేదని ఆరోపించిన ఆయన, ఆమె వ్యవహారంతో డాన్సర్స్ అసోసియేషన్ పరువు దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. అసోసియేషన్‌లో వివాదాలను మరింత పెంచుతున్నారని విమర్శిస్తూ, త్వరలో అధ్యక్ష బాధ్యతలు చేపడతానని ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!