

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూత్ డేటింగ్ రియాలిటీ షో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా’ సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6: ప్యార్ యా పైసా’ పేరుతో ప్రారంభమైన ఈ సీజన్ ప్రేమా? డబ్బా? అనే కాన్సెప్ట్‌తో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఈసారి ఈ షో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రావడం విశేషం. మే 12 నుంచి ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 7 గంటలకు జియోహాట్‌స్టార్ మరియు MTVలో స్ట్రీమింగ్ అవుతోంది.
మహాబలిపురం తీర ప్రాంతంలో చిత్రీకరించిన ఈ సీజన్లో 33 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. వీరిని ‘ప్యార్ విల్లా’, ‘పైసా విల్లా’ అనే రెండు గ్రూపులుగా విభజించారు. సన్నీ లియోన్, కరణ్ కుంద్రా హోస్ట్స్‌గా వ్యవహరిస్తుండగా, నియా శర్మ, ఉర్ఫీ జావేద్ ‘మిస్చిఫ్ మేకర్స్’గా అదనపు వినోదాన్ని అందిస్తున్నారు. కొత్త ట్విస్టులు, బోల్డ్ డ్రామాతో ఈ సీజన్ యువతలో మంచి క్రేజ్ సంపాదిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!