

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను అందుకుంటోంది. అయితే సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పటికీ, సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు చిత్రంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, ఆమె పాత్రను పరిమితంగా చూపించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో అచ్చియమ్మ పాత్రపై వచ్చిన విమర్శాత్మక పోస్టుకు జాన్వీ కపూర్ లైక్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎలాంటి వ్యాఖ్య చేయకపోయినా, ఆ పోస్టును లైక్ చేయడాన్ని కొందరు ఆ విమర్శలకు మద్దతుగా భావిస్తున్నారు. మరోవైపు, ఒక పోస్టుకు లైక్ చేసినంత మాత్రాన ఆమె అభిప్రాయాన్ని నిర్ణయించడం సరైంది కాదని అభిమానులు చెబుతున్నారు. దీంతో జాన్వీ చర్యపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!