.png&w=3840&q=75)

మలయాళంలో రూపొందిన కోర్ట్‌రూమ్ డ్రామా చిత్రం ‘జానకి వర్సెస్ కేరళ (జె.ఎస్.కె)’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో, కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఎం. అచ్చిబాబు ఎంజీ మూవీస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు విడుదల చేయనున్నారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఈ చిత్రంలో కథానాయిక జానకి విద్యాదరన్ (అనుపమ పరమేశ్వరన్) పై జరిగే లైంగిక దాడి అనంతరం ఆమె న్యాయం కోసం చేసే పోరాటం ప్రధాన కథాంశంగా కనిపిస్తుంది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబిస్తూ చట్ట వ్యవస్థపై బలమైన సందేశాన్ని అందించేలా సినిమా రూపొందిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో దివ్య పిళ్లై, శృతి రామచంద్రన్, అస్కర్ అలీ, మాధవ్ సురేష్ గోపి, బైజు సంతోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నిర్మాత జె. ఫణీంద్ర కుమార్ నిర్మించిన ఈ సినిమాను మంచి కాన్సెప్ట్‌తో రూపొందించామని, తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అచ్చిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.









.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!