
సినిమాలు

రష్యా ఇంధన ఎగుమతుల ద్వారా పొందుతున్న ఆదాయాన్ని తగ్గించేందుకు అమెరికా మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రూపొందించిన ఆంక్షల బిల్లును పరిశీలించేందుకు అమెరికా సెనెట్ సభ్యులు అంగీకరించారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే, రష్యా చమురు దిగుమతి చేస్తున్న భారత్ వంటి దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది రష్యా ఆర్థిక వనరులను నియంత్రించాలనే అమెరికా వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు.
ఈ బిల్లు సెనెట్‌లో 86-12 ఓట్ల తేడాతో ముందడుగు వేసింది. ఇక ఇది ప్రతినిధుల సభ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారుతుంది. అదే జరిగితే, రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాల నుంచి దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లభిస్తుంది. ఈ పరిణామం భారత్, చైనా వంటి దేశాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!