
జనరల్

విద్యార్థులపై జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న వేధింపులను తక్షణమే నిలిపివేయాలని, లేకపోతే మరోసారి దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపడతామని సీజేపీ హెచ్చరించింది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను పోలీసులు వేధించడం ఆపాలని, పరిస్థితిలో మార్పు లేకపోతే భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు.
గతంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల దర్యాప్తును కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి విరుద్ధంగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారని సీజేపీ ఆరోపించింది. విద్యార్థులపై జరుగుతున్నట్లు చెబుతున్న వేధింపులను వెంటనే నిలిపివేసి, వారికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!