
సినిమాలు

నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా విజయానంతరం వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉండనున్నట్లు సమాచారం. అయితే ఆ పాటలో ఎవరు కనిపించనున్నారన్న అంశంపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
దసరాలో నానితో కలిసి నటించి మెప్పించిన కీర్తి సురేష్ ఈ ప్రత్యేక గీతానికి అంగీకరించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే ‘దసరా’ హిట్ జోడీ మరోసారి తెరపై సందడి చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!