

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం ఇప్పుడు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో కూడా దూసుకెళ్తోంది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వంటి ప్రముఖ వేదికల్లో ఇప్పటికే 9.5 లక్షల టికెట్ల విక్రయాలు నమోదైనట్లు సమాచారం. చిన్న సినిమాగా విడుదలై ఈ స్థాయి స్పందన పొందడం విశేషంగా మారింది.
త్వరలోనే ఈ సినిమా 10 లక్షల టికెట్ మార్క్‌ను కూడా దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. శ్రీ గౌరీ ప్రియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చగా, ఎస్‌కేఎన్ నిర్మించారు. ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచి విజయవంతంగా దూసుకెళ్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!