

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన కాంతా సినిమా నవంబర్ 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, విడుదలకు కొన్ని రోజులు ముందే ఈ సినిమా లీగల్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ప్రముఖ తమిళ నటుడు, గాయకుడు ఎం.కె. త్యాగరాజ భాగవతార్ మనవడు బి. థియాగరాజన్ చెన్నై సివిల్ కోర్టులో కేసు నమోదు చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం, ఈ సినిమా తన తాత జీవితంపై ఆధారపడి, కుటుంబ అనుమతి లేకుండా తీసారని, అలాగే ఆయనను ప్రతికూలంగా చూపారని తెలిపారు.
అయితే నిర్మాత దగ్గుబాటి రాణా ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. ఆయన మాట్లాడుతూ, “ఈ వార్తలు నిరాధారమైనవి. సినిమా ఏ నిజమైన వ్యక్తిపై ఆధారపడలేదు. నవంబర్ 14 న థియేటర్లలో కలుద్దాం” అని స్పష్టం చేశారు. ఎక్స్‌లో ఫ్యాన్స్‌తో జరిగిన Q&A సెషన్లో కూడా ఆయన ఇదే విషయాన్ని ధృవీకరించారు. దుల్కర్ సల్మాన్, రాణా కలిసి చేసిన ఈ పీరియడ్ డ్రామాలో సముతిరఖని, భాగ్యశ్రీ బోర్స్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!