
ఓటీటీ

నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ ఎపిక్ ‘స్వయంభూ’ విడుదలకు దగ్గరపడుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రా రా ధీవర’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదట సమ్మర్ రిలీజ్‌గా ప్లాన్ చేసినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడింది.
సినిమా విజువల్ గ్రాండియర్ కోసం టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఫాంటమ్ FX స్టూడియోలో భారీ స్థాయిలో CG, VFX పనులు జరుగుతున్నాయి. మొత్తం 2700కి పైగా VFX షాట్స్, 750కి పైగా టెక్నీషియన్స్‌తో ప్రపంచ స్థాయి విజువల్స్ అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నిఖిల్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కూడా నేరుగా ఈ ప్రాసెస్‌ను మానిటర్ చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!