
జనరల్

దక్షిణ కొరియాలోని సియోల్‌లో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఆపరేషన్స్) టే హన్ లీతో పాటు సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని, కియా ప్రత్యేక పీబీవీ వాహనాల ఉత్పత్తిని కూడా రాష్ట్రంలో చేపట్టాలని మంత్రి కోరారు.
విశాఖపట్నం పోర్టు సమీపంలో సీకేడీ అసెంబ్లీ, ఎక్స్‌పోర్ట్ సెంటర్, ఈవీ కాంపోనెంట్ల తయారీ యూనిట్, పవర్‌ట్రెయిన్ టెస్టింగ్ మరియు వెహికల్ హోమోలోగేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లోకేష్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను సంస్థ ఉన్నతస్థాయిలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని కియా మోటార్స్ ప్రతినిధులు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!