
జనరల్

తమ పనీర్ ప్యాకెట్లపై ‘ఫ్రెష్ పనీర్’ అని ముద్రించడంపై భారత ఆహార భద్రత, ప్రామాణికాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) జారీ చేసిన షోకాజ్ నోటీసుకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సవివరంగా సమాధానం ఇచ్చింది. ప్యాకెట్‌పై ఉన్న లేబుల్ తమ ఉత్పత్తికి సరైన వివరణేనని, అది వినియోగదారులను తప్పుదారి పట్టించేలా లేదని సంస్థ స్పష్టం చేసింది.
‘ఫ్రెష్ పనీర్’ అంటే తాజాగా పాశ్చరైజ్డ్ పాలతో తయారైన, రిఫ్రిజిరేషన్‌లో పరిమిత కాలం నిల్వ ఉంచి వినియోగించాల్సిన పాల ఉత్పత్తి అని హెరిటేజ్ వివరించింది. ఈ లేబుల్ ఉత్పత్తి స్వభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని, వినియోగదారులకు సరైన సమాచారాన్నే అందిస్తోందని సంస్థ పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!