
జనరల్

దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు రూపొందిస్తున్న తాజా చిత్రం ‘సింగ్ గీతం’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. వినూత్న కథలతో పేరుపొందిన ఆయన మరోసారి భిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమా తీస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘హలో బాసు’ పాట కూడా సినిమాపై చర్చను పెంచింది. అయితే ఆ పాట సినిమా భాగం కాదని చిత్రబృందం స్పష్టం చేసింది.
పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ కథను సింగీతం చాలా ఏళ్ల క్రితమే ఆలోచించారని, ‘పుష్పక విమానం’ కంటే ముందే ఈ కాన్సెప్ట్ సిద్ధమైందని ఆయన తెలిపారు. కమల్ హాసన్‌కు కూడా అప్పట్లో ఈ కథ వినిపించారని, కానీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఆధునిక శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!