

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అఖిల్ రాజ్ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ‘శనార్తి’, ‘ఫైట్ మహా’, ‘క్రేజీ కళ్యాణం’ వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’. రితికా రవిందర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా, కేడీ కంపెనీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. సాయితేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
కాలం, విధి నేపథ్యంలో సాగే విభిన్నమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. తాజాగా విడుదల తేదీపై మేకర్స్ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లోనే గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విడుదల తేదీపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో అఖిల్ రాజ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!