

2011లో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘జిందగీ నా మిలేగి దొబారా’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా స్పెయిన్, భారత్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో చిత్రీకరించారు. సుమారు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.153 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీక్వెల్‌పై దర్శకురాలు జోయా అక్తర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇటీవల 2025లో హృతిక్ రోషన్, అభయ్ డియోల్, ఫర్హాన్ అక్తర్ కలిసి ఓ ప్రకటనలో కనిపించడంతో ‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో మాన్సూన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న జోయా అక్తర్ మాట్లాడుతూ.. సీక్వెల్‌కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పాత్రలను ఎలా చూపించాలనే అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే అభిమానులకు మంచి సినిమాను అందించాలనుకుంటున్నామని చెప్పారు. 2025 ప్రకటనను చాలామంది సీక్వెల్ ట్రైలర్‌గా భావించారని, ఆ తర్వాత అది కేవలం ప్రకటన అని తెలియడంతో సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేశారని జోయా గుర్తుచేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!