

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడినందుకు గతంలో విధించిన నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. తాజాగా జరిగిన జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహారశైలిపై కౌన్సిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
సినీ పరిశ్రమ పెద్దలు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫెడరేషన్ సూచనలను పట్టించుకోకుండా డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికలు నిర్వహించడాన్ని కౌన్సిల్ తప్పుపట్టింది. డ్యాన్సర్స్ ఫెడరేషన్‌కు ఇకపై ఫిలిం ఫెడరేషన్ సంస్థాగతంగా సహకరించబోదని, అయితే డ్యాన్సర్లకు వ్యక్తిగతంగా సహాయం చేస్తామని తెలిపింది. మిగిలిన 23 క్రాఫ్ట్స్‌కు యథావిధిగా సహకారం అందిస్తామని పేర్కొంది. జానీ మాస్టర్ ఫెడరేషన్‌కు చెల్లించిన రూ.3 లక్షలను తిరిగి పంపిస్తున్నట్లు వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!