
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల (జూడాలు) స్టైపెండ్‌ను 5 శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జూడాలు 15 శాతం పెంపును కోరగా, ప్రభుత్వం 5 శాతం పెంపునకు సమ్మతించింది. 2026 జనవరి 1 నుంచి ఇంటర్న్‌ల స్టైపెండ్ 5 శాతం పెరగనుంది. ఆ తర్వాత జూడాల స్టైపెండ్‌ను ప్రతి ఏడాది 3 శాతం చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అదేవిధంగా పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థుల స్టైపెండ్‌ను కూడా ఏటా 3 శాతం చొప్పున పెంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుని జూనియర్ డాక్టర్లు వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!