

తమిళ సినీ పరిశ్రమలో విభిన్నమైన కథాంశాలు, ప్రత్యేకమైన కథనంతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు మారి సెల్వరాజ్.. ‘మంజనతి’ అనే ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎమోషనల్ అండ్ లేడీ ఓరియంటెడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కథిర్, పొన్‌వేల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, ఫార్చ్యూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుశాంత్ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
తాజాగా ‘మంజనతి’ షూటింగ్ గ్రాండ్‌గా నిర్వహించిన పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఇళయరాజా క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చిత్రబృందం మొత్తం క్రీమ్ అండ్ వైట్ డ్రెస్ కోడ్‌లో క్లాసీగా కనిపించింది. వేడుకకు సంబంధించిన ఫొటోలను మారి సెల్వరాజ్ ఎక్స్‌లో పంచుకున్నారు. అలాగే పసుపు రంగు చీర, మెడలో పూలమాలతో ఉన్న ఓ అమ్మాయి చుట్టూ వింత ఆకారాలతో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!