

కొండా సురేఖ అనుచరులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొండా సురేఖకు ఒక న్యాయం, రాజగోపాల్ రెడ్డికి మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి గతంలో ఎన్నోసార్లు అవమానించారని, అయినప్పటికీ ఆయనపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా వర్గం నిలదీసింది. మొన్నటివరకు సీఎంపై తీవ్ర విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని ఆరోపించింది.
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన వెంటనే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారని కొండా వర్గం విమర్శించింది. పదవి కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. రాజగోపాల్ రెడ్డి వైఖరిలో వచ్చిన మార్పు రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొండా అనుచరులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!