

ఏపీ డీఎస్సీ నియామక ప్రక్రియలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ-ఈ మైనారిటీ కేటగిరీలో రెండు ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెద్దాపురానికి చెందిన సక్కు లక్ష్మీ సునీత బీసీ-బీ కేటగిరీకి చెందినప్పటికీ బీసీ-ఈ సర్టిఫికెట్ పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్‌ను 2025 ఆగస్టు 18న పెద్దాపురం ఎమ్మార్వో జారీ చేసినట్లు సమాచారం. అనంతరం ఆమె కాట్రేనికోన మండలం కందికుప్ప పాఠశాలలో తెలుగు టీచర్‌గా నియమితులయ్యారు. దీనిపై పిఠాపురానికి చెందిన షేక్ అమీరుద్దీన్ ఫిర్యాదు చేయగా, ఇప్పటివరకు అధికారులు సర్టిఫికెట్‌ను పరిశీలించలేదని ఆయన ఆరోపించారు.
ఇదిలా ఉండగా, డీఎస్సీ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. డీఎస్సీని సక్రమంగా నిర్వహించి ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టెట్ రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఎలా ఇచ్చారని, సాఫ్ట్‌బాల్ సంఘానికి చెందిన వ్యక్తి భార్యకు ఉద్యోగం ఎలా వచ్చిందని నిలదీశారు. మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలోనే అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఆయన, తప్పులను ప్రశ్నిస్తున్న వారి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తున్నారని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!